Balakrishna: కేసీఆర్ గారికి నేనంటే పుత్ర వాత్సల్యం ఉంది: బాలకృష్ణ

  • ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దల భేటీ
  • బాలయ్యకు అందని పిలుపు
  • తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలయ్య
  • తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరణ
Balakrishna clarifies his comments

ఇటీవల తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ ప్రముఖులు చర్చలు జరపడం, ఆ సమావేశాలకు అగ్రనటుడు బాలకృష్ణను పిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. దీనిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి.

దీనిపై ఓ ఇంటర్వ్యూలో బాలయ్య వివరణ ఇచ్చారు. కేసీఆర్ గారు ఈ సమావేశాలకు తనను ఎందుకు పిలవలేదో తెలియదని, ఆయనకు తనపై ఎప్పుడూ కోపం లేదని స్పష్టం చేశారు. పైగా, ఎన్టీఆర్ అభిమాని అయిన కేసీఆర్ కు తానంటే పుత్ర వాత్సల్యం ఉందని తెలిపారు. ఈ ఘటనను రాజకీయపరంగా చూడొద్దని పేర్కొన్నారు. గతంలో తాను కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల కారణంగా పిలిచుండకపోతే ఆ విషయమైనా తనతో చెప్పి ఉండాల్సిందని అన్నారు.

More Telugu News