టీడీపీకి ప్రతిఫలం లభించడం మొదలైంది: నాగబాబు కీలక వ్యాఖ్యలు

Nagababu comments on TDP Goes Viral
  • కర్మకు ఏ విధమైన మెునూ లేదు
  • ఏడు వంటకాలున్న భోజనంలో తొలి వంటకమిది
  • ట్విట్టర్ లో నాగబాబు వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ విత్తిన విత్తనాల నుంచి ప్రతిఫలాలను పొందడం ప్రారంభించిందని నటుడు నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "కర్మకు ఏ విధమైన మెనూ లేదు. మీరు కోరుకున్నది మీకు లభిస్తుందో లేదో తెలియదు. అయితే, టీడీపీ ఇప్పుడు వారి డెజర్ట్ ను వడ్డిస్తోంది. ఇది ఒక ప్రారంభం మాత్రమే.  ఏడు వంటకాలున్న భోజనంలో 1 వంటకం మాత్రమే అందించబడింది, టిడిపి ఇప్పుడు వారు విత్తిన విత్తనాల నుంచి ప్రతిఫలాలను పొందుతోంది" అని వ్యాఖ్యానించారు. నాగబాబు ట్వీట్ వైరల్ కాగా, భిన్న రకాల కామెంట్లను వస్తున్నాయి.
Go Back to Shorts
nagababu
Twitter
Telugudesam

More Telugu News