శిష్యుడి సినిమాకి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న సుకుమార్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శిష్యుడి సినిమాకి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న సుకుమార్!

Sukumar trims uppena movie
  • చిరు మేనల్లుడు వైష్ణవ్ తేజ్ పరిచయం 
  • లాక్ డౌన్ వల్ల విడుదలకు బ్రేక్ 
  • ఓటీటీ ప్లేయర్స్ నుంచి మంచి ఆఫర్లు
  • నిడివి తగ్గిస్తున్న సుకుమార్
చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఉప్పెన'. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు అనే కుర్రాడు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమైన తరుణంలో లాక్ డౌన్ రావడంతో థియేటర్లు మూతబడ్డాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది.

ఇక ఓటీటీ ప్లేయర్స్ నుంచి మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ, థియేటర్ లోనే విడుదల చేయాలన్న నిర్ణయంతో ఇవ్వలేదు. మరోపక్క చిత్రానికి భారీ మొత్తంలో ఖర్చుపెట్టి లావిష్ గా తీశారట. దీంతో కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల చేయాలని చూస్తున్నారు. మరోపక్క, వచ్చే నెలలో లాక్ డౌన్ ఎత్తేసినప్పటికీ, వెంటనే థియేటర్లకి ప్రేక్షకులు అంతగా రాకపోవచ్చు. అందుకని మంచి సమయం చూసుకుని చిత్రాన్ని రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట.

ఇక విషయనైకి వస్తే, తన శిష్యుడైన బుచ్చిబాబు తొలిచిత్రానికి కథలో సహకారం అందించమే కాకుండా, చిత్ర నిర్మాణంలో కూడా దర్శకుడు సుకుమార్ భాగస్వామి అయ్యాడు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ 'ఉప్పెన'పై సుకుమార్ దృష్టిని పెట్టాడట. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సినిమా క్రిస్ప్ గా సాగడానికి అనువుగా కాస్త కటింగ్ ఇస్తున్నాడట. అలాగే సినిమా నిడివి విషయంలో కూడా ప్రేక్షకులు బోర్ ఫీలవ్వకుండా వుండడం కోసం అనవసరంగా అనిపించే సీన్లకు కత్తెరేస్తున్నాడట!
Sukumar
Uppena
Vaishnav Tej
Buchibabu

More Telugu News