పెళ్లి పేరుతో పేరెంట్స్ కి దూరం కావడం నాకు ఇష్టం లేదు: హీరోయిన్ సాయిపల్లవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి పేరుతో పేరెంట్స్ కి దూరం కావడం నాకు ఇష్టం లేదు: హీరోయిన్ సాయిపల్లవి

Sai Pallavi
  • ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు
  •  కెరియర్ పైనే పూర్తి దృష్టి
  •  పేరెంట్స్ తో ఉండిపోతానన్న సాయిపల్లవి  
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. పారితోషికం ఎంత ఇస్తానని చెప్పినా, కథ - పాత్ర నచ్చకపోతే చేయకపోవడం సాయిపల్లవి ప్రత్యేకత. పాత్ర ఎలాంటిదైనా చాలా సహజంగా .. తేలికగా చేసేయడంలో ఆమె సిద్ధహస్తురాలు. అలాంటి సాయిపల్లవి త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టుగా కొన్ని  రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే సినిమాలను ఎక్కువగా ఒప్పుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ విషయాన్ని గురించి సాయిపల్లవి స్పందించింది. "త్వరలో నేను పెళ్లి చేసుకోనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నా  దృష్టి  అంతా కూడా కెరియర్ పైనే వుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే పెళ్లి పేరుతో తల్లిదండ్రులకు దూరం కావడం నాకు ఇష్టం ఉండదు. మా అమ్మానాన్నలు  ఎక్కడ వుంటే అక్కడ .. వాళ్లతో పాటే ఉండిపోవాలని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
Sai Pallavi
Actress
Tollywood

More Telugu News