Taapsee: పిల్లలు కావాలనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్ తాప్సీ

  • నేను ప్రేమలో పడింది నిజమే
  • పెళ్లి విషయంలో టెన్షన్ లేదు
  • పెళ్లి వేడుక సింపుల్ గానే జరుగుతుందన్న తాప్సీ  
Taapsee

తెలుగు తెరపై తెల్లమందారంలా విరిసిన తాప్సీ, ఆ తరువాత తమిళ సినిమాలు కూడా చేసింది. ప్రస్తుతం హిందీ సినిమాలతో ఆమె బిజీగా వుంది. బాలీవుడ్ సినిమాలు ఆమెకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి. అలాంటి  తాప్సీ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తన పెళ్లి విషయాన్ని గురించి ప్రస్తావించింది.

"ఎక్కడికి వెళ్లినా నా పెళ్లిని గురించి అడుగుతున్నారు. నేను లవ్ లో పడ్డాను .. నాకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అతను సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తి కాదు .. బిజినెస్ మేన్ కూడా కాదు. అతను ఎవరనేది సమయం వచ్చినప్పుడు చెబుతాను.

ఇక ప్రేమలో ఉన్నప్పటికీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాననేది మాత్రం చెప్పలేను. నా పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది గనుక ఆ విషయంలో ఎలాంటి టెన్షన్ లేదు. ఎప్పుడు పిల్లలు కావాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాను. పెళ్లి ఎప్పుడు జరిగినా ఆ వేడుక సింపుల్ గానే  ఉంటుంది. కొంతమంది బంధువులు .. కొంతమంది స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా జరుగుతుంది" అంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News