శ్రీదేవి లేనిదే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' లేదు: చిరంజీవి

Jagadekaveerudu Athiloka sundari Movie
  • దేవత పాత్రలో శ్రేదేవి గొప్పగా చేసింది
  •  ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము
  • అతిలోక సుందరంటే శ్రీదేవినే అని చెప్పిన చిరూ
తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా చెప్పుకునే గొప్ప చిత్రాలలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఒకటి. చిరంజీవి - శ్రీదేవి జంటగా నటించిన ఆ సినిమా, దర్శకుడిగా రాఘవేంద్రరావు స్థాయిని మరింత పెంచింది. ఆ సినిమా 30 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ఓ వీడియో ద్వారా తన మనోభావాలను పంచుకున్నారు.

ముఖ్యంగా ఆయన శ్రీదేవి గురించి మాట్లాడుతూ .. "శ్రీదేవి లేనిదే ఈ సినిమా లేదు .. ఈ సినిమా .. ఈ పాత్ర కేవలం శ్రీదేవి కోసమే తయారయ్యాయా అనిపిస్తుంది. దేవతగా ఆ పాత్రలో శ్రీదేవిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. తన అందచందాలతో .. హొయలతో .. చిలక పలుకులతో .. అమాయకపు చూపులతో .. శ్రీదేవి ఆ పాత్రను అత్యద్భుతంగా చేసింది. ఇప్పటికీ అతిలోక సుందరి అంటే శ్రీదేవినే గుర్తొస్తుంది. అంతగా ఆమె ఆ పాత్రతో ప్రభావితం చేసింది. అలాంటి శ్రీదేవితో కలిసి నటించడం ఒక అందమైన అనుభూతి. ఆమెతో డాన్స్ చేయడానికి నేను పోటీ పడవలసి వచ్చింది .. శ్రమ పడవలసి వచ్చింది"  అంటూ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Chiranjeevi
Sridevi
Raghavendra Rao

More Telugu News