Akashay Kumar: విడుదలకి సిద్ధమవుతున్న 'లక్ష్మీ బాంబ్'

  • తెలుగు .. తమిళ భాషల్లో హిట్ కొట్టిన 'కాంచన'
  • 'లక్ష్మీ బాంబ్' టైటిల్  తో హిందీ రీమేక్
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు

Lakshami Bomb Movie

లారెన్స్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా కొంతకాలం క్రితం వచ్చిన 'కాంచన'  తమిళ  .. తెలుగు భాషల్లో  భారీ విజయాన్ని సాధించింది. ఈ రెండు భాషల్లో ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. దాంతో హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయడానికి అక్షయ్ కుమార్ ఉత్సాహాన్ని చూపించాడు. లారెన్స్ దర్శకత్వంలోనే ఈ సినిమా రీమేక్ చేయడానికి అక్షయ్ ఆసక్తిని కనబరిచాడు.  

ఆరంభంలో నిర్మాతలతో లారెన్స్ కి మనస్పర్థలు వచ్చినప్పటికీ, అక్షయ్ కుమార్ సర్దిచెప్పడంతో లారెన్స్ ఈ ప్రాజెక్టు పైనే వున్నాడు. షూటింగు పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, విఎఫ్ఎక్స్ పనులను జరుపుకుంటోంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. లాక్ డౌన్ తరువాత సాధారణ పరిస్థితులు నెలకొనగానే ఈ సినిమాను థియేటర్స్ కి తీసుకురానున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో విజయాన్ని సాధించిన ఈ సినిమా, హిందీలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. అక్షయ్ మాత్రం ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో వున్నాడు.

More Telugu News