బాలికపై ఎంఐఎం నేత అత్యాచారం.. రిమాండ్ కు తరలింపు!
- హైదరాబాద్ చాదర్ ఘాట్లో దారుణం
- బాధితురాలిని పరామర్శించిన బీజేపీ, దళిల సంఘాల నేతలు
- ఓల్డ్ సిటీలో హిందువులకు రక్షణ లేదన్న బీజేపీ
మరోవైపు బాధితురాలిని ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాధితురాలికి పార్టీ తరపున అండగా ఉంటామని చెప్పారు. నిందితుడికి శిక్షపడేలా చూస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బలాలా బాధితురాలు ఇంటికి చేరుకున్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
దీనిపై బలాలా మాట్లాడుతూ, నిందితుడికి తమ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. ఫొటోలు పెట్టుకున్న వారంతా అనుచరులు కాదని అన్నారు. ప్రధాని మోదీ ఫొటోను విజయ్ మాల్యా పెట్టుకున్నారని... అంత మాత్రాన మోదీని విమర్శిస్తే ఎలాగని ప్రశ్నించారు.