Siva Reddy: వైయస్ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి కన్నుమూత

Ex MLA Siva Reddy dead
షార్ట్స్‌లో చూడండి
సీనియర్ రాజకీయ నేత, కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ ఉదయం ప్రొద్దుటూరులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

దివంగత వైయస్ రాజశేఖరరెడ్డికి శివారెడ్డి అత్యంత సన్నిహితుడు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. శివారెడ్డి మరణంతో ఆయన స్వగ్రామం ఎర్రగుంట్లలో విషాదం నెలకొంది. ఈ సాయంత్రం నాలుగు గంటలకు ప్రొద్దుటూరులో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 1978లో కమలాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా  పోటీ చేసి ఆయన గెలుపొందారు.
Go Back to Shorts
Siva Reddy
Kadapa District
Proddutur
YSR

More Telugu News