Nani: నాన్ స్టాప్ గా వినోదాన్ని పంచే సినిమాలో నాని!

  • నాని తాజా చిత్రంగా రానున్న 'వి'
  • తదుపరి చిత్రంగా 'శ్యామ్  సింగ రాయ్'
  • లైన్లో దర్శకుడు వివేక్ ఆత్రేయ
Vivek Atreya Movie

నాని తాజా చిత్రంగా రూపొందిన 'వి' ..  విడుదల తేదీ, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు వున్నాయి. ఆ తరువాత సినిమాగా నాని 'శ్యామ్ సింగ రాయ్' చేయవలసి వుంది. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత ఈ సినిమా షూటింగు మొదలుకానుంది.

ఈ నేపథ్యంలో దర్శకుడు వివేక్ ఆత్రేయకి కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు 'బ్రోచేవారెవరురా' సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు.  ఆయన వినిపించిన కథ నచ్చడంతో వెంటనే నాని ఓకే చెప్పేశాడట.  'బ్రోచేవారెవరురా' తరహాలోనే ఈ సినిమా పూర్తి వినోదభరితంగా సాగుతుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం కథానాయికను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వైపున 'శ్యామ్  సింగ రాయ్' చేస్తూనే మరో వైపున వివేక్ ఆత్రేయ సినిమాను నాని చేయనున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

More Telugu News