ముంబైలో కఠిన చర్యలు.. రోడ్డెక్కితే జైలుకే!
- ముంబైలో సెక్షన్ 144
- మే 17 వరకు అమలు
- రోడ్డెక్కితే 6 నెలలు జైలే
వైద్యం కోసం తప్ప వేరే ఇతర పనుల కోసం రోడ్లపైకి రావద్దని మహా ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా రోడ్డుపైకి వస్తే... 6 నెలల పాటు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. రాత్రి వేళల్లో కేవలం మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.