Chiranjeevi: 'ఆచార్య'లో చరణ్ ఎపిసోడ్ లో కనిపించనున్న అనసూయ

  • విభిన్నమైన కథాకథనాలతో 'ఆచార్య'
  • నక్సలైట్ పాత్రలో కనిపించనున్న చరణ్
  • స్పెషల్ సాంగులో మెరవనున్న రెజీనా
Acharya Movie

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. లాక్ డౌన్ తరువాత తదుపరి షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమాలో చిరంజీవి .. రెజీనా కాంబినేషన్లో ఒక స్పెషల్ సాంగ్ వుంది. ఆ పాటను చిత్రీకరించడం జరిగిపోయింది.

అనసూయపై మరో స్పెషల్ సాంగ్ ఉందనే టాక్ వచ్చింది. ఒక సినిమాలో రెండు స్పెషల్ సాంగ్స్ ఎలా వుంటాయనే సందేహం మనకు వస్తుంది. అయితే ఈ సినిమాలో అనసూయపై స్పెషల్ సాంగ్ ఉన్నమాట వాస్తవమేనని అంటున్నారు. ఇందులో నక్సలైట్ గా నటిస్తున్న చరణ్ ఎపిసోడ్ లో ఆమె కనిపిస్తుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ పాటలో అనసూయ దుమ్మురేపేస్తుందన్న మాట.

More Telugu News