Sensex: లాక్ డౌన్ దెబ్బకు మార్కెట్లు కుదేలు... కుప్పకూలిన సెన్సెక్స్!

Sensex crashes after government extends lockdown
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో, వారు అమ్మకాలకే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంటో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,002 పాయింట్లు నష్టపోయి 31,715కి పడిపోయింది. నిఫ్టీ 566 పాయింట్లు కోల్పోయి 9,293కు దిగజారింది. టెలికాం, హెల్త్ కేర్ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.49%), సన్ ఫార్మా (0.04%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-10.96%), బజాజ్ ఫైనాన్స్ (-10.21%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-10.08%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-9.58%), మారుతి సుజుకి (-8.75%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News