Lockdown: ఏపీలో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లడానికి మార్గదర్శకాల జారీ!

guidelines for migrants
షార్ట్స్‌లో చూడండి
లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకున్న వలస కూలీలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే, అధికారులకు పలు కీలక సూచనలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని జిల్లాల్లో చిక్కుకున్న కూలీలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సూచనలు చేసింది.

  • రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న కార్మికులు 1902 ఫోన్ నంబరుకు కాల్ చేయాలి
  • వలస కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి
  • గ్రీన్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్లకు మాత్రమే రాకపోకలకు అనుమతి
  • శిబిరాల నుంచి స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారికి ర్యాండమ్‌గా పరీక్షలు
  • పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని బస్సుల్లో తరలించాలి
  • బస్సుల్లో 50 శాతానికి మించకుండా తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు
  • స్వగ్రామానికి చేరుకున్న అనంతరం కూలీలు అక్కడ మరోసారి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి
  • అనంతరం మరో 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి
  • ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ బృందం మొత్తాన్ని అక్కడే ఉంచాలి
  • పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి
  • ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి గురించి అధికారులు ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలి
  • ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాలి
Go Back to Shorts
Lockdown
Andhra Pradesh
Telangana

More Telugu News