సీటు బెల్ట్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన పాక్ స్టార్ క్రికెటర్
- పీఎస్ఎల్-2026లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ఆటగాడు
- సీటు బెల్టు లేకపోవడంతో కారు ఆపిన ట్రాఫిక్ పోలీసు అధికారి
- జరిమానా విధించవలసి ఉంటుందని అడిగిన అధికారి
- కారులో ఉన్నది క్రికెటర్ కాసేపటికి గుర్తించిన ట్రాఫిక్ పోలీసు అధికారి
పాకిస్థాన్ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పోలీసులకు పట్టుబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇస్లామాబాద్ హైవేపై కారు వెళుతుండగా ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి అతని కారును ఆపి, సీటు బెల్టు పెట్టుకోలేదని చెప్పినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానా విధించవలసి ఉంటుందని, దానిని కడతారా అని కూడా సదరు ట్రాఫిక్ పోలీసు అధికారి అడుగుతారు.
కొద్దిక్షణాల తర్వాత కారులో కూర్చుని ఉన్నది ప్రముఖ క్రికెటర్ అని ట్రాఫిక్ పోలీసు అధికారి గుర్తిస్తారు. ఆ తర్వాత వారి మధ్య సంభాషణ సరదాగా మారిపోయింది. ఇర్ఫాన్ ఖాన్ శుక్రవారం కారులో తన స్నేహితులతో కలిసి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో (పీఎస్ఎల్) రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ కింగ్స్‌మెన్స్ ప్రదర్శన గురించి అడుగుతారు. పీఎస్ఎల్ 2026 ఫైనల్లో పెషావర్ జల్మీ టీమ్ టైటిల్ గెలుచుకుంది. పీఎస్ఎల్లోకి ఈ సంవత్సరం హైదరాబాద్ కింగ్స్‌మెన్, రావల్ఫిండిజ్ జట్లు కొత్తగా వచ్చాయి. హైదరాబాద్ కింగ్స్‌మెన్ పైనల్లో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.