తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటా విడుదల షెడ్యూల్ ఇదిగో!
- విడతలవారీగా మే నెలలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్న టికెట్లు
- మే 18న ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
- మే 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటా విడుదల
- అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచన
తిరుమల శ్రీవారిని ఆగస్టు నెలలో దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 2026 నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల ఆన్‌లైన్ కోటా విడుదల షెడ్యూల్‌ను శనివారం ప్రకటించింది. మే నెలలో విడతలవారీగా ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది.
వివరాల ప్రకారం, సుప్రభాతం, తోమాల, అర్చన వంటి ఆర్జిత సేవల కోసం ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 18 ఉదయం 10 గంటల నుంచి మే 20 ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన వారు మే 22 మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి ఇతర సేవల టికెట్లను మే 21 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 23 నుంచి 25 వరకు జరగనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లు కూడా అదే రోజు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి.
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23 ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన టికెట్ల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను మే 23 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు.
భక్తులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) టికెట్ల కోటాను మే 25 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల బుకింగ్ కోటాను అందుబాటులో ఉంచుతారు. భక్తులు అధికారిక వెబ్‌సైట్ `ttdevasthanams.ap.gov.in` ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారులను ఆశ్రయించవద్దని టీటీడీ సూచించింది.