భారత రాయబార కార్యాలయ అధికారికి పాకిస్థాన్ సమన్లు

Pakistan allegations on India
  • భారత్ పై పాక్ ఆరోపణ
  • రఖ్ చిక్రీ సెక్టార్ లో భారత్ కాల్పులకు పాల్పడింది
  • ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయని ఆరోపణ
భారత బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని పాకిస్థాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారికి సమన్లు జారీ చేసింది. ఎటువంటి కారణం లేకుండా రఖ్ చిక్రీ సెక్టార్ లో భారత బలగాలు కాల్పులకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ ఈ సమన్లు ఇచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. అంతేకాకుండా, నియంత్రణ రేఖను ఆనుకుని ఉన్న జనావాసాలను లక్ష్యంగా చేసుకుని శక్తమంతమైన ఆయుధాలతో భారత్ కాల్పులకు పాల్పడుతోందని ఆరోపించింది.
Go Back to Shorts
Pakistan
LOC
India
summons

More Telugu News