Allu Arjun: 'పుష్ప' కోసం షరతులు పెట్టిన విజయ్ సేతుపతి?

  • రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్న 'పుష్ప'
  • విజయ్ సేతుపతి వైపే మొగ్గుచూపుతున్న బన్నీ
  • ఆలోచనలో పడిన సుకుమార్
Sukumar Movie

అల్లు అర్జున్ -  సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. లాక్ డౌన్ తీయగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. కథానాయికగా రష్మికను తీసుకున్న సుకుమార్, ఒక కీలకమైన పాత్ర కోసం విజయ్ సేతుపతిని సంప్రదించాడట.

తమిళంలో హీరోగా విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ వుంది. ఆ హీరోయిజం దెబ్బ తినకుండా ఉండటం కోసం, ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేయకూడదనే కండిషన్ పెట్టాడట. ఒకవేళ తమిళంలోను విడుదల చేయవలసిందే అంటే మాత్రం, తమిళ వెర్షన్ కోసం వేరే ఆర్టిస్ట్ ను పెట్టుకోమని అన్నాడట. అంతేకాదు .. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో, అందుకు తగినట్టుగా తన పారితోషికం 10 కోట్లు వుండాలని అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ కారణంగానే 'భైరవ గీత' ఫేమ్ ధనుంజయ్ ను తీసుకుందామని సుకుమార్ అంటే, విజయ్ సేతుపతితోనే మరోసారి మాట్లాడమని బన్నీ అంటున్నాడట.

More Telugu News