అనుష్క తీరుపై 'నిశ్శబ్దం' నిర్మాతల అసహనం?
- షూటింగు పూర్తిచేసుకున్న 'నిశ్శబ్దం'
- లాక్ డౌన్ కారణంగా విడుదల ఆలస్యం
- అమెజాన్ నుంచి భారీ ఆఫర్
ఈ నేపథ్యంలో 'నిశ్శబ్దం' సినిమాకి అమెజాన్ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. సినిమా పూర్తయిపోయి నెలకి 50 లక్షలు వడ్డీలు కట్టుకుంటున్న నిర్మాతలు, అమెజాన్ కి ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అమెజాన్ కి ఇవ్వాలంటే అందుకు అనుష్క అనుమతి కూడా కావాలి. అయితే, ఆమె మాత్రం అంగీకరించడం లేదట. దాంతో వడ్డీలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న నిర్మాతలు, ఆమె ధోరణి పట్ల అసహనంతో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.