Koratala Siva: చిరంజీవి 'ఆచార్య' సినిమా అప్డేట్స్ వెల్లడించిన కొరటాల శివ

  • 'ఆచార్య' సినిమా షూటింగ్ 40 శాతం పూర్తి అయింది
  • చరణ్ కోసం హీరోయిన్ ను ఎంపిక చేయాలి
  • మరో ఐదేళ్లలో రిటైర్మెంట్ తీసుకుంటా
Chiranjeevi movie Acharya shooting 40 percent finished says Korata Siva

చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'ఆచార్య' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పారు. రామ్ చరణ్ కోసం హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉందని తెలిపారు. ఇదొక సోషియో-ఫాంటసీ చిత్రమని... సహజ వనరులను కాపాడేందుకు ఒక వ్యక్తి చేసే పోరాటమే 'ఆచార్య' అని చెప్పారు.

ఈ సందర్భంగా కొరటాల శివ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఐదేళ్ల తర్వాత దర్శకుడిగా రిటైర్మెంట్ తీసుకుంటానని ఆయన చెప్పారు. కొత్త దర్శకులను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయమని తెలిపారు. కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించేందుకు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిస్తానని చెప్పారు.

More Telugu News