Andhra Pradesh: కృష్ణా జిల్లాలో నాటు తుపాకి పేలి ఒకరి మృతి

One dead in Krishna District due to gun fire
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లోని కృష్టా జిల్లా మండవల్లిలోని తక్కెళ్లపాడులో నాటు తుపాకీ పేలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని తమిళనాడుకు చెందిన రాజా అనే వ్యక్తిగా గుర్తించారు. ఇతను తమిళనాడులోని పళని జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న చేపల చెరువు వద్ద కాపలాదారుడిగా ఉంటూ, పిట్టలను తరిమే వ్యక్తిగా పని చేస్తున్నాడు. రాజా మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఈ మృతి వార్తతో స్థానికులు ఉలిక్కి పడ్డారు.
Go Back to Shorts
Andhra Pradesh
Gun Fire
Krishna District

More Telugu News