Nagashourya: దర్శకుడు అవసరాలను కథ మార్చమంటున్న నిర్మాతలు

Avarasala Movie
పీపుల్ మీడియా బ్యానర్లో నాగశౌర్య కథానాయకుడిగా అవసరాల శ్రీనివాస్ కొంతకాలం క్రితం ఒక సినిమాను మొదలుపెట్టాడు. ఈ కథ ఇటు ఇండియాలోను .. అటు అమెరికాలోను నడుస్తుంది. ఇక్కడికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. మిగతా భాగాన్ని అమెరికాలో చిత్రీకరిద్దామని అనుకుంటూ ఉండగానే కరోనా దెబ్బ పడింది. దాంతో ఇప్పట్లో అమెరికాలో షూటింగు చేసే పరిస్థితి లేదు.

అందువలన కథలో అమెరికా ప్రస్తావన లేకుండా చేసి, మిగతా భాగాన్ని కూడా ఇక్కడే పూర్తి చేసేలా చూడమని నిర్మాతలు అవసరాల శ్రీనివాస్ తో చెప్పారట. సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయమనీ, లేదంటే తాము పెద్ద మొత్తంలో నష్టపోవలసి వస్తుందని అన్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. అవసరాలకి కథలపై మంచి పట్టుంది. అందువలన ఆయన కథను మార్చుకుని, అమెరికా వెళ్లకుండా ఇక్కడే కానిచ్చేయచ్చు!
Nagashourya
Avasarala
Tollywood

More Telugu News