ఇంటికి వెళ్లాలనుంది: సింగర్ కనిక కపూర్ భావోద్వేగం
- నేను ఐసీయూలో లేను
- పిల్లలను, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వేచి చూస్తున్నాను
- వారిని ఎంతో మిస్ అవుతున్నాను
"కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని జీవితం నేర్పుతుంది. కానీ అదే కాలం, జీవితం యొక్క విలువను తెలియచేస్తుంది" అంటూ ఒక కొటేషన్ పోస్ట్ చేసింది
కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నెల 20న కనికాను ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. మార్చి 23, 27 తేదీల్లో నిర్వహించిన టెస్టుల్లో కూడా పాజిటివ్ అని తేలింది. ఆమెపై పోలీసు కేసు కూడా నమోదైంది.