Chiranjeevi: 'ఆచార్య' సినిమాలో అనసూయ సాంగ్?

  • చిరంజీవి సరసన నాయికగా కాజల్ 
  •  స్పెషల్ సాంగులో రెజీనా 
  • అనసూయకు భారీ పారితోషికం
Acharya Movie

కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. చిరంజీవిని డిఫరెంట్ లుక్ తో .. పవర్ఫుల్ పాత్రలో కొరటాల చూపించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను ఎంపిక చేసుకున్నారు.

ఇక చిరంజీవి - రెజీనా కాంబినేషన్లో ఒక ఐటమ్ సాంగు కూడా వుంది. ఇటీవలే ఈ పాటను 6 రోజుల పాటు చిత్రీకరించారు. సినిమాలో ఈ పాట ఇంటర్వెల్ కి ముందు రానున్నట్టు తెలుస్తోంది. ఇంటర్వెల్ తరువాత కూడా ఒక ప్రత్యేక సాంగ్ ను ప్లాన్ చేశారట. ఈ స్పెషల్ సాంగు కోసం అనసూయను తీసుకున్నట్టుగా సమాచారం. అనసూయ హాట్ హాట్ గా కనిపిస్తూ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయనుందని అంటున్నారు. ఈ ప్రత్యేక గీతం కోసం ఆమెకి భారీ పారితోషికమే ముట్టినట్టుగా చెబుతున్నారు.

More Telugu News