ప్రిన్స్ చార్లెస్ తో కనిక కపూర్ పాత ఫొటో తెచ్చిన కలకలం.. నెటిజన్ల ఫైర్!
- ప్రిన్స్ చార్లెస్ కు కరోనా పాజిటివ్
- చార్లెస్ ను కనిక కలిసిన ఫొటోలు వైరల్
- మళ్లీ టార్గెట్ చేసిన నెటిజన్లు
మరోవైపు, బ్రిటీష్ యువరాజు చార్లెస్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో లండన్ లో ప్రిన్స్ చార్లెస్ తో కనిక కపూర్ మాట్లాడుతున్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రిన్స్ చార్లెస్ కు ఆమె ద్వారానే కరోనా సోకి వుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ఈ ఫొటోలు 2015లో ఓ ఈవెంట్ సందర్భంగా తీసినవని పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అప్పట్లో రాచకుటుంబం నిర్వహించిన ఆ ఈవెంట్ కు కనిక హాజరయిందని... ఆ సందర్భంగా ప్రిన్స్ చార్లెస్ తో కాసేపు ముచ్చటించిందని తెలుస్తోంది.