Nani: అంతా మిథ్య... చివరికి మనిషికి మనిషే తోడు: నాని

Hero Nani comments in the wake of corona
షార్ట్స్‌లో చూడండి
'మార్చి నెలలో కరోనాను అంతమొందిద్దాం, ఏప్రిల్ లో పండగ చేసుకుందాం' అంటూ ఇటీవలే కరోనా మహమ్మారిపై ఉత్సాహభరితమైన ట్వీట్ చేసిన టాలీవుడ్ హీరో నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు, కులం, మతం, డబ్బు, పేరు ప్రతిష్ఠలు అంతా మిథ్య అని, చివరికి మనిషికి మనిషే తోడు అని అభిప్రాయపడ్డారు. మనందరం ఒకే కుటుంబం అంటూ, ప్రతి ఒక్కరూ తోటివారి క్షేమం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. బాధ్యతగా మెలగండి, సురక్షితంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Nani
Corona Virus
Hero
Tollywood

More Telugu News