యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మరోసారి అనుష్క
- అనుష్క నుంచి రానున్న 'నిశ్శబ్దం'
- మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి సన్నాహాలు
- గతంలో హిట్ కొట్టిన 'భాగమతి'
యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ హోమ్ బ్యానర్ అన్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్లో గతంలో అనుష్క చేసిన 'భాగమతి' భారీ విజయాన్ని సాధించింది. మళ్లీ ఇప్పుడు అనుష్కతో మరో సినిమాను నిర్మించడానికి వాళ్లు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.