Amrutha: తల్లిని ఓదార్చి మళ్లీ అత్తారింటికి వెళ్లిపోయిన అమృత!

Amrutha visits mother in Miryalaguda
  • కొన్నిరోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న అమృత తండ్రి
  • అమ్మ వద్దకు వెళ్లమ్మా అంటూ మారుతీరావు సూసైడ్ నోట్
  • తల్లిని చూడగానే భావోద్వేగాలకు లోనైన అమృత
అప్పట్లో ప్రణయ్ హత్యోదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సినిమాకు తీసిపోని ప్రణయ్, అమృతల ప్రేమకథ, వారి మధ్య అమృత తండ్రి మారుతీరావు విలనిజం... ప్రజల్లోకి బాగా చొచ్చుకుని వెళ్లాయి. ఇటీవలే మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో, భర్తను కోల్పోయిన స్త్రీ ఎంత బాధపడుతుందో తనకు తెలుసంటూ తల్లికి సానుభూతిగా అమృత వ్యాఖ్యానించింది.

ఆమె తండ్రి మారుతీరావు కూడా తన ఆత్మహత్య లేఖలో అమ్మ వద్దకు వెళ్లమ్మా అంటూ రాయడం చాలామందిని కలచివేసింది. ఈ క్రమంలో అమృత తన తల్లిని పరామర్శించింది. మిర్యాలగూడలో తన తల్లి గిరిజ నివాసానికి వచ్చిన అమృత తీవ్రభావోద్వేగాలకు లోనైంది. అరగంట సేపు అక్కడే గడిపిన అమృత తల్లితో ఓదార్పు వచనాలు పలికింది. ఆపై తిరిగి అత్తారింటికి వెళ్లింది.
Amrutha
Maruti Rao
Girija
Miryalaguda

More Telugu News