KGF-2: కేజీఎఫ్-2 విడుదల తేదీ ప్రకటించిన చిత్రబృందం

  • అక్టోబరు 23న వరల్డ్ వైడ్ రిలీజ్
  • కేజీఎఫ్ కు సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్-2
  • అప్పట్లో భారీ కలెక్షన్లు వసూలు చేసిన కేజీఎఫ్
KGF chapter two release date announced

కొన్నాళ్ల కిందట వచ్చిన కన్నడ చిత్రం కేజీఎఫ్ పాన్ ఇండియన్ సినిమాకు సిసలైన ఉదాహరణలా నిలిచింది. కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఆ సినిమా హీరో యశ్ కు విపరీతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. హిందీలోనూ కేజీఎఫ్ కు ప్రేక్షకాదరణ లభించింది. ఈ నేపథ్యంలో, కేజీఎఫ్ కు సీక్వెల్ గా కేజీఎఫ్ చాప్టర్-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యశ్, శ్రీనిధి శెట్టి జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ హై ఆక్టేన్ యాక్షన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 23న రిలీజవుతుందని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

More Telugu News