హైదరాబాదు శివారులో నడిరోడ్డుపై దగ్ధమైన బస్సు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
Add ap7am to your home Screen

హైదరాబాదు శివారులో నడిరోడ్డుపై దగ్ధమైన బస్సు.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు

Private Travel Bus Burned in Sangareddy dist
  • రామచంద్రాపురంలో ఘటన
  • భయంతో బస్సు దిగిన ప్రయాణికులు
  • ఆ వెంటనే మంటల్లో కాలిబూడిదైన బస్సు
హైదరాబాదు శివారులో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు నడిరోడ్డుపై దగ్ధమైంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిందీ ఘటన. బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఆ వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు కిందికి దిగిన కాసేపటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Private Bus
Sangareddy District
Ramachandrapuram
Telangana

More Telugu News