స్టేజ్ పై డ్యాన్స్ అదరగొట్టిన జాన్వీ కపూర్... వీడియో ఇదిగో!

Janvi Kapoor Dance on Stage goes Viral
  • నాసిక్ లో పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా హాజరైన జాన్వీ
  • అభిమానుల కోరిక మేరకు నృత్యం
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా ప్రపంచానికి పరిచయమైనా, తన అందం, నటనతో 'ధడక్' సినిమాతో అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించుకున్న జాన్వీ కపూర్, నాసిక్ పోలీసులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని, 'జింగ్ జింగ్ జింగాత్' పాటకు తనదైన శైలిలో స్టెప్పులేసి అదరగొట్టింది. ఫ్యాన్స్ కోరిక మేరకు 'ధడక్' సినిమాలోని ఈ సాంగ్ కు ఆమె వేసిన స్టెప్పులు అదరహో అనిపించాయి.

ఇక జాన్వీ ప్రస్తుతం కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న 'తఖ్త్' చిత్రంలో నటిస్తోందన్న సంగతి తెలిసిందే. ఇందులో రణవీర్ సింగ్ హీరో, వచ్చే సంవత్సరం క్రిస్మస్ కానుకగా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, మొగల్ సామ్రాజ్య కథాంశంతో సినిమా సాగుతుందని సమాచారం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.

Go Back to Shorts
Janvi Kapoor
Sridevi
Dhadak
Dance
Nasik

More Telugu News