ఇద్దర్నీ చంపేయడానికి ప్రయత్నించారు: నారా లోకేశ్
- మాచర్లలో బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై దాడి
- వైసీపీ రాక్షసపాలనకు పరాకాష్ఠగా పేర్కొన్న నారా లోకేశ్
- హైకోర్టు న్యాయవాదిపై ఘోరంగా దాడి చేశారని వెల్లడి
- బీహార్ కంటే దారుణంగా ఉందని వ్యాఖ్యలు
ఈ ఘటనలో ఇద్దరు నాయకులను హత్య చేసేందుకు ప్రయత్నించారని, హైకోర్టు న్యాయవాది కిశోర్ పై ఘోరంగా దాడి చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వెయ్యడానికి కూడా వీల్లేదంటూ అరాచకం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి, ఎస్కార్టుగా వచ్చిన పోలీసులపైనా వైసీపీ రౌడీలు దాడి చేసే పరిస్థితి వచ్చిందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఏపీలో బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు.