ఈ కోర్టు తీర్పు చెడుపై మంచి సాధించిన విజయం: నారా లోకేశ్
- చెడుపై మంచి గెలిచిన రోజున హోలీ జరుపుకుంటాం
- అదే రోజున రంగులు చెరిపివేయాలని కోర్టు తీర్పు ఇవ్వడం శుభపరిణామం
- ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ రివర్స్ పాలన సాగిస్తున్నారని విమర్శలు
"పేదవాడికి పట్టెడన్నం పెట్టడానికి మనసొప్పలేదు కానీ, రూ.1400 కోట్ల ప్రజాధనంతో రంగులు వేశారు. ఇప్పుడా రంగులు చెరిపివేసేందుకు మరో రూ.1400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇదేనా మీ రివర్స్ పాలన?" అంటూ ధ్వజమెత్తారు.