దర్శక నిర్మాతగా మారిన సీనియర్ హీరోయిన్ కల్యాణి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శక నిర్మాతగా మారిన సీనియర్ హీరోయిన్ కల్యాణి

Kalyani
  • కథానాయికగా మంచి గుర్తింపు 
  • కేరక్టర్ ఆర్టిస్ట్ గాను అవకాశాలు 
  • దర్శకురాలిగా సైకలాజికల్ థ్రిల్లర్  
తెలుగు తెరపై తెలుగుదనం ఉట్టిపడే పాత్రలను పోషించిన నిన్నటితరం కథానాయికగా కల్యాణి కనిపిస్తుంది. కథానాయికగా చేసింది కొన్ని చిత్రాలే అయినా, అవి ఆమెకు తెచ్చిన గుర్తింపు ఎక్కువ. ఈ మధ్యనే ఆమె కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా మారింది. కొన్ని ముఖ్యమైన పాత్రల్లో తెరపై కనిపించింది.

అలాంటి కల్యాణి మెగా ఫోన్ పట్టేసింది. తన అసలు పేరు కావేరి .. కల్యాణి పేరుతో ఆమె తెరకి పరిచయమైంది. అందువల్లనే కె.2కె. బ్యానర్ ను స్థాపించి ఒక సినిమాను రూపొందిస్తోంది. చేతన్ చీను హీరోగా పరిచయమవుతున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి, 'హోలీ' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఫస్టు టీజర్ గ్లిమ్ప్స్ ను వదిలారు. దర్శక నిర్మాతగా పెద్ద సాహసమే చేస్తున్న కల్యాణి, ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.
Kalyani
Chethan Cheenu
Tollywood

More Telugu News