వచ్చేందుకు వీల్లేదంటూ నినాదాలు... తండ్రి మృతదేహాన్ని చూడకుండానే వెనుదిరిగి వెళ్లిన అమృత!

Amrutha at Miryalaguda Grave Yard
  • మిర్యాలగూడలో మారుతీరావు అంత్యక్రియలు
  • 'అమృత గో బ్యాక్' అంటూ నినాదాలు
  • వెంటనే వెళ్లిపోయిన అమృత
మిర్యాలగూడలోని శ్మశాన వాటికలో మారుతీరావు అంత్యక్రియలు జరుగుతున్న వేళ, ఆయన కుమార్తె అమృత అక్కడకు చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. తండ్రికి తుదిసారి నివాళులు అర్పించాలంటూ, తనవారితో కలిసి పోలీసు వాహనంలో అమృత అక్కడికి రాగా, మారుతీరావు బంధుమిత్రులు వాహనాన్ని అడ్డుకున్నారు.

అమృత రావడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. 'మారుతీరావు అమర్ రహే', 'అమృత గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. కనీసం తల్లిని పలకరించేందుకు కూడా ఆమె రాలేదని కేకలు వేశారు. దీంతో తండ్రి మృతదేహాన్ని చూడకుండానే, క్షణాల వ్యవధిలోనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరు వర్గాలకూ నచ్చజెప్పిన పోలీసులు, బందోబస్తు మధ్యే అమృతను తిరిగి ఇంటికి చేర్చారు. ఆపై మారుతీరావు సోదరుడు శ్రవణ్ తన అన్న అంత్యక్రియలు నిర్వహించారు.
Go Back to Shorts
Amrutha
Maruti Rao
Last Riots
Tributes

More Telugu News