'బ్రోచేవారెవరురా' దర్శకుడితో నాని!
- ఈ నెల 25వ తేదీన రానున్న 'వి'
- లైన్లో రెండు ప్రాజెక్టులు
- మైత్రీ బ్యానర్లో మరో మూవీ
గతంలో వివేక్ 'బ్రోచేవారెవరురా' చిత్రాన్ని రూపొందించాడు. పూర్తి వినోదభరితంగా ఆ సినిమాను తెరెకెక్కించిన ఆయన భారీ విజయాన్ని అందుకున్నాడు. అందువలన తదుపరి ప్రాజెక్టుపై అందరిలోను ఆసక్తి వుంది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ బౌండ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో బిజీగా వున్నాడనీ, ఈ సినిమా కూడా పూర్తి వినోదభరితమైనదిగానే రూపొందుతుందని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.