Ayush additiona director: జలుబు, దగ్గు, జ్వరాన్ని ఆర్సెనిక్​ 30 కంట్రోల్​ చేస్తుంది: ‘ఆయుష్’​ అడిషనల్​ డైరెక్టర్​ లింగరాజు

  • ఎయిర్ పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ చేసిన వారికి ఈ మందు ఇచ్చాం
  • ఈ మందు వాడకం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు
  • రామంతపూర్ లోని ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో ఈ మందు  లభిస్తుంది

హైదరాబాద్ లో కరోనా వైరస్ రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ‘కరోనా’ వ్యాపించకుండా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ఇప్పటికే చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆయుష్ అడిషనల్ డైరెక్టర్ లింగరాజు మాట్లాడుతూ, జలుబు, దగ్గు, జ్వరాన్ని హోమియోపతి మందు ఆర్సెనిక్ 30 కంట్రోల్ చేస్తుందని, ఎయిర్ పోర్టులో ఇప్పటి వరకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన వారికి ఈ మందు ఇచ్చామని చెప్పారు. ఈ మందు వాడకం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని తెలిపారు. రామంతపూర్ లోని ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో ఈ మందు అందజేస్తున్నామని, ఏడాది మొత్తం ఈ మందు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

More Telugu News