Vishvanth: కథ వినకుండానే ఓకే చెప్పేశాను: 'ఓ పిట్టకథ' హీరో విశ్వంత్

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • ప్రతి పాత్ర ప్రత్యేకంగా కనిపిస్తుంది 
  • తప్పకుండా హిట్ అవుతుందన్న విశ్వంత్ 
O PittaKatha Movie

'మనమంతా' సినిమాతో నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన విశ్వంత్, ఆ తరువాత తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే వున్నాడు. తాజాగా రూపొందిన 'ఓ పిట్టకథ' సినిమాలోను ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ నెల 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో విశ్వంత్ ఈ సినిమాను గురించి మాట్లాడుతూ .. 'గ్రామీణ నేపథ్యంలో రూపొందిన విభిన్నమైన కథా చిత్రం ఇది. ప్రతి పాత్రకి ఒక పిట్టకథ ఉంటుంది. అందువల్లనే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. చంద్రశేఖర్ యేలేటిగారు ముందుగా ఈ కథ విన్నారట. కథ చాలా బాగుందని ఆయన చెప్పారు. ఆయనపైగల నమ్మకంతో నేను కథ వినలేదు. ఈ తరహా స్క్రీన్ ప్లే తో ఇంతవరకూ ఏ సినిమా రాలేదనే చెప్పాలి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News