Sree Vishnu: కామెడీ ఎంటర్టైనర్ గా 'రాజ రాజ చోర' .. ఫస్టులుక్ రిలీజ్

Raja Raja Chora Movie
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. అలా ఆయన చేసిన 'బ్రోచే వారెవరురా' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఆయన మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'రాజ రాజ చోర' అనే టైటిల్ ను ఖరారు చేశారు. హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాయికగా సునయన చేస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు .. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ రోజున శ్రీవిష్ణు పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను వదిలారు. రాజులు ధరించే వస్త్రధారణతో వున్న ఆయన, కిరీటం పడిపోతున్నా పట్టించుకుకోకుండా పరుగులు తీస్తున్నట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు. ఇది కామెడీ ఎంటర్టైనర్ అనీ .. ఆయన దొంగపాత్రలో కనిపించనున్నాడని టైటిల్ ను బట్టి .. ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. ఏప్రిల్ నాటికి ఈ సినిమా టాకీ పార్టు పూర్తవుతుందనేది దర్శక నిర్మాతల మాట.
Sree Vishnu
Sunayana
Raja Raja Chora Movie

More Telugu News