జగన్ కంపెనీలో నిమ్మగడ్డ రూ.854 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం నిజం కాదా?: వర్ల రామయ్య
- రస్ అల్ ఖైమా వ్యవహారంపై స్పందించాలి
- జగన్ మౌనం అర్ధ అంగీకారం అనుకోవాలా?
- రస్ అల్ ఖైమా దేశం అంటే ఎందుకు జగన్ వణుకుతున్నారు?
- గెజిట్ నోటిఫికేషన్‌తో జగన్ భయపడిపోతున్నారు
ఈ విషయంపై జగన్ కొనసాగిస్తోన్న మౌనం అర్ధ అంగీకారం అనుకోవాలా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. జగన్‌కి ఎవరో చెత్త సలహాలు ఇస్తున్నారని ఆయన అన్నారు. రస్ అల్ ఖైమా దేశం అంటే ఎందుకు జగన్ వణుకుతున్నారని ఆయన అన్నారు. జగన్‌కి ధైర్యం ఉంటే మీడియా సమావేశంలో ఈ విషయంపై స్పందించాలని ఆయన సవాలు విసిరారు. కేంద్ర ప్రభుత్వం గత నెల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో జగన్ భయపడిపోతున్నారని అన్నారు. జగన్ కంపెనీలో నిమ్మగడ్డ రూ.854 కోట్లు పెట్టుబడి పెట్టిన విషయం నిజం కాదా? అని నిలదీశారు.