తోకలు కత్తిరిస్తామన్న చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి కౌంటర్
- ప్రకాశం జిల్లా పర్యటనలో వైసీపీ నేతలపై చంద్రబాబు వ్యాఖ్యలు
- స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే అంబటి
- ఎవరి తోకలు ఎవరు కత్తిరిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారంటూ వ్యాఖ్యలు
చంద్రబాబు బస్సు యాత్రలకు భయపడేది లేదని, టీడీపీ బస్సు యాత్రలను ఎవరూ అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు యాత్రను ఎవరూ లెక్కచేయడంలేదని అంబటి వ్యాఖ్యానించారు. శవరాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని, డబ్బులు వెదజల్లి అధికారం చేజిక్కించుకోవడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు. పంచాయతీ రాజ్ చట్టంతో చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బులు, మద్యం నియంత్రించేందుకు పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు తెచ్చామని వివరించారు.