చిరూ సినిమా నుంచి తప్పుకున్న చరణ్ .. తెరపైకి బన్నీ?
- చిరూతో కొరటాల తాజా చిత్రం
- సందేశంతో కూడిన వినోదభరిత చిత్రం
- ఉత్సాహాన్ని చూపుతున్న అల్లు అర్జున్
రాజమౌళి సినిమా షరతుల ప్రకారం, 'ఆర్ ఆర్ ఆర్' పూర్తయ్యేవరకూ చరణ్ మరో ప్రాజెక్టును అంగీకరించకూడదు, ఆ సినిమాకి ముందు .. చరణ్ చేసిన మరో సినిమా విడుదల కాకూడదట. అందువల్లనే కొరటాల సినిమాలో చరణ్ చేసే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. చరణ్ చేయాలనుకున్న ఆ పాత్రకు అల్లు అర్జున్ అయితే బాగుంటాడనే అభిప్రాయాన్ని కొరటాల వ్యక్తం చేశాడట. ఆ పాత్రను చేయడానికి అల్లు అర్జున్ కూడా ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు.