టీడీపీ ప్రజాచైతన్య యాత్ర కరపత్రం విడుదల చేసిన కళావెంకట్రావు
- వైసీపీ నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం
- తొమ్మిది నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచింది
- J-ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోంది
వైసీపీ తొమ్మిది నెలల పాలన 9 రద్దులు, 9 భారాలతో గడిచిందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో ప్రవేశపెట్టిన ప్రజలకు ఉపయోగపడే మంచి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని , ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచారని మండిపడ్డారు. ఇప్పటికే అర్హుల పింఛన్లు తొలగించారని, మరిన్ని పింఛన్లు తొలగించే ప్రయత్నంలో ఉందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు బలవంతంగా J-ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, ఈ ట్యాక్స్ కింద అధికార పార్టీకి రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.