పవన్ కల్యాణ్‌ను 'పిచ్చికుక్క' అన్న ఎమ్మెల్యే జోగి రమేశ్.. జనసేన ఆగ్రహం
- నిరసన ప్రదర్శనకు సిద్ధమైన జనసేన నేతలు
- జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమన్న జనసేన నేతలు
పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని జనసేన అధికార ప్రతినిధి అజయ్ వర్మ ఈ సందర్భంగా అన్నారు. నిరసన తెలియజేసే హక్కు తమకుందని, పోలీసులు ముందుగానే ఎలా అరెస్టు చేస్తారని ఆయన నిలదీశారు. జగన్‌లా తమ నాయకుడు పవన్ అవినీతి చేసి జైలుకు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. సంస్కారం మరచి మాట్లాడటం పవన్ తమకు నేర్పలేదని చెప్పారు.