‘V’ టీజర్​ విడుదల.. ‘సోది ఆపు.. దమ్ముంటే నన్ను ఆపు’ అంటున్న హీరో నాని

Hero Nani V teaser release
  • నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘V’
  • మార్చి 25న ‘V’ విడుదల  
  • ఈ చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి
నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘V’ చిత్రం టీజర్ విడుదలైంది. సోషల్ మీడియా వేదికగా ఈ చిత్ర టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. 'ఫూల్స్ మాత్రమే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్.. అప్పుడప్పుడు నాలోంటోడు రూల్స్ కొద్దిగా బ్రేక్ చేస్తుంటాడు అంతే‘ అంటూ సుధీర్ బాబు డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది.

’యూ ఆర్ సైకో యూ నో దట్‘ అని నివేదా ధామస్, ’అమ్మో, నిజమా‘ అని నాని డైలాగ్స్ చెప్పడం కనబడుతుంది. ’న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడటానికి నువ్వొస్తున్నావంటే, నేనేమీ నీ ఫ్యాన్ ని కాదురా‘, ’సోది ఆపు.. దమ్ముంటే నన్ను ఆపు’ అంటూ సుధీర్ బాబుని ఉద్దేశించి నాని చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానున్న ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్లుగా నివేదా ధామస్, అదితిరావు హైదరీ నటిస్తున్నారు.

Go Back to Shorts
Nani
Tollywood
‘V’ movie
Teaser
Release

More Telugu News