వైసీపీనీ, ‘సాక్షి’ ని వదలకపోతే గట్టిగా పట్టుకోండి.. ఏం అభ్యంతరం లేదు: యనమలకు అంబటి కౌంటర్
- చంద్రబాబుపై ఆరోపణలు రావడం ఇవాళేమీ కొత్త కాదు
- లక్షల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు చేశారు
- అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి
వైసీపీనీ, ‘సాక్షి’ ని వదలమని టీడీపీ నేత యనమల అంటున్నారని, ‘వదలకపోతే గట్టిగా పట్టుకోండి. ఏం అభ్యంతరం లేదు’ అని అంబటి కౌంటర్ ఇచ్చారు. నేరారోపణలు చంద్రబాబు, లోకేశ్ లపై జరుగుతుంటే వాళ్లు మాట్లాడరే? ఈ నేరంతో తమకు సంబంధం లేదని చెప్పరే? వాళ్ల గొంతులో ఎందుకు వెలక్కాయ పడింది? మీరే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటూ యనమలతో సహా టీడీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. మాజీ పీఎస్ ఇంట్లో ఐటీ దాడులతో తమకేమి సంబంధం అని చెప్పిన యనమల, ఇప్పుడేమో ఆయన ఇంట్లో అసలేమీ దొరకలేదంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ పీఎస్ తరఫున మీరు వకాల్తా పుచ్చుకుంటారా? లేదా? ఆయన నేరానికి పాల్పడ్డారా? లేదా? ఈ నేరంలో మీకు భాగముందా? లేదా? అంటూ అంబటి ప్రశ్నల వర్షం కురిపించారు.