బొత్స ప్రకటనపై జగన్ సమాధానం చెప్పాలి: కనకమేడల
- ఢిల్లీలో జగన్ ఏం బేరసారాలు ఆడుతున్నారు?
- కేసుల్లో తనకు సహకరించాలని కేంద్రాన్ని కోరుతున్నారు
- హోదాపై కేంద్రంతో ప్రకటన చేయించిన తర్వాతే ఎన్డీయేలో చేరాలి
ఎన్డీయేలో వైసీపీ చేరుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారని... ఈ విషయమై ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రంతో ప్రకటన చేయించిన తర్వాతే ఎన్డీయేలో చేరాలని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, ప్రాజెక్టులను సాధించిన తర్వాత ఎన్డీయేలో చేరితే ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదని అన్నారు.