కేసుల మాఫీ కోసమా? దేని కోసం ఎన్డీయేలో చేరుతున్నారు?: బొత్సకు బుద్ధా వెంకన్న ప్రశ్న
- బొత్స చెప్పారంటే వైసీపీలో అది వేదవాక్కు
- రాజధానిని తరలిస్తున్నట్టు తొలుత చెప్పింది బొత్సే
- ఎన్టీయేలో వైసీపీ కలవబోతోందని ఇప్పుడు కూడా ఆయనే చెప్పారు
కేసుల మాఫీ కోసమా? బెయిల్ రద్దు అవ్వకుండా ఉండేందుకా? దేని కోసం ఎన్డీయే లో చేరుతున్నారు? ఈ ప్రశ్నలకు బొత్స సమాధానం చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. తల వంచి, కాళ్లు పట్టుకొని ఎన్డీయేలో చేరి సాధించబోయేది ఏంటో బొత్స గారు వివరించాలని అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.