Sensex: అంచనాలకు మించి పెరగనున్న ద్రవ్యోల్బణం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex falls over 100 points
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు ఎక్కువ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంచనాల కంటే ఎక్కువగా ద్రవ్యోల్బణం పెరగబోతోందంటూ అధికారిక డేటా వెలువడటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు కోల్పోయి 41,459కి పడిపోయింది. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 12,174 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ (2.31%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.30%), ఇన్ఫోసిస్ (1.60%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.08%), సన్ ఫార్మా (1.06%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.54%), టాటా స్టీల్ (-1.83%),  ఐసీఐసీఐ బ్యాంక్ (-1.71%), ఎన్టీపీసీ (-1.70%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.44%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News