వైసీపీ ఎంపీ చేసిన కామెడీకి ఫిదా అయిపోయా: నారా లోకేశ్

  • అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారూ
  • ఆ కంపెనీలో పెట్టుబడులు ఎందుకు పెట్టారో జగన్ ను నిలదీయండి
  • ఓ అంతర్జాతీయ సంస్థ ఉత్తరాంధ్రకు రావడం జగన్ కు ఇష్టం లేదు
నిన్న లోక్ సభలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీపై చేసిన ఆరోపణల గురించి తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.  

'అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు. ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కంపెనీ పేరు కూడా తెలుసుకోకుండా 'ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ' అంటూ పార్లమెంటులో వైకాపా ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ నన్ను ఫిదా చేసింది. ఫ్రాంక్లిన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ అయితే, అలాంటి ఆ కంపెనీలో మీరెందుకు పెట్టుబడులు పెట్టారని జగన్ గారిని నిలదీయండి ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ ఎంపీ గారు.

ఒక అంతర్జాతీయ సంస్థ ఉత్తరాంధ్రకి రావడం జగన్ గారికి మొదటి నుండీ ఇష్టం లేదు. ఉత్తరాంధ్ర యువతకి మంచి కంపెనీలో ఉద్యోగాలు రావడం వైసీపీ నాయకులకు రుచించడం లేదు. ఎప్పటికీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండాలి అనే దురుద్దేశంతో కంపెనీలు రాకుండా అడ్డుపడుతున్నారు. బినామీ కంపెనీలు అంటూ చెత్త మాటలు మాట్లాడుతున్నారు కాబట్టే కంపెనీలు జగన్ గారిని చూసి బైబై ఏపీ అంటున్నాయి' అని లోకేశ్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Franklin Templeton
Mithun Reddy
YSRCP

More Telugu News